మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. 1800 క్యారెట్ల వజ్రాల బ్లౌజ్.. నిజాం కాలపు నగల మెరుపు!

  • మెట్ గాలా వేదికపై భారతీయ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఇషా
  • ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేక చీరలో మెరిసిన ఇషా అంబానీ
  • అంతర్జాతీయ వేదికలపై భారతీయ డిజైనర్ల దుస్తులనే ధరిస్తున్న ఇషా

మెట్ గాలా 2026 వేదికపై రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ తన అద్భుతమైన వస్త్రధారణతో భారతీయ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారు. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరకట్టులో ఆమె మెరిసిపోయారు. ఈ చీరపై చేత్తో చిత్రించిన 'పిచ్వాయ్' (Pichwai) కళాఖండాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 


రిలయన్స్ రీటెయిల్ సంస్థ 'స్వదేశ్'కు కళాకారులు స్వచ్ఛమైన బంగారు తీగలతో నేసిన అంచు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఆమె ధరించిన బ్లౌజ్ 1800 క్యారెట్ల వజ్రాలు, ఎమరాల్డ్స్, పోల్కీ నగలతో మెరిసిపోవడమే కాకుండా... అందులో నిజాం నవాబుల నాటి అరుదైన 'సర్ పేచ్' (Sarpech) ఆభరణాన్ని చేర్చడం ఒక చారిత్రాత్మక స్పర్శను ఇచ్చింది. ఈ ఆభరణాలన్నీ తన తల్లి నీతా అంబానీ కలెక్షన్ లోనివని ఇషా పేర్కొన్నారు.


వీటితో పాటు, సుబోధ్ గుప్తా రూపొందించిన క్రోచెట్ బ్యాగ్‌లో మామిడి పండును పట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌరభ్ గుప్తా పేపర్, ఇత్తడితో రూపొందించిన 'గజ్రా'ను తలలో అలంకరించుకోవడం ద్వారా ఆమె భారతీయ మూలాలను అద్భుతంగా ప్రతిబింబించారు. 


అంతకుముందు జరిగిన ప్రీ-మెట్ గాలా పార్టీలో కూడా భారత్‌లోని 26 రకాల విభిన్న ప్రాంతీయ హస్తకళల బోర్డర్లతో రూపొందించిన డ్రెస్‌ను ధరించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. గత మూడేళ్లుగా రాహుల్ మిశ్రా, అనామికా ఖన్నా వంటి భారతీయ డిజైనర్ల దుస్తులనే ధరిస్తూ, ఇషా అంబానీ అంతర్జాతీయ వేదికపై భారతీయ ఫ్యాషన్‌కు బలమైన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


Isha Ambani
Met Gala 2024
Mukesh Ambani
Nita Ambani
Indian Fashion
Gaurav Gupta
Pichwai Art
Reliance Retail Swadesh
Nizam Sarpech
Diamond Blouse

More Telugu News